Begin typing your search above and press return to search.

SVC59: రౌడీతో దిల్ రాజు 'రూరల్ యాక్షన్ డ్రామా'

ఈ సందర్భంగా విజయ్, దిల్ రాజు, రవి కిరణ్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   4 May 2024 6:45 AM GMT
SVC59: రౌడీతో దిల్ రాజు రూరల్ యాక్షన్ డ్రామా
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశించిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ రిజల్ట్ ను ఏమాత్రం పట్టించుకోని విజయ్.. దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు - శిరీష్ నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రాన్ని #SVC59 అనే వర్కింగ్ టైటిల్ తో ఈరోజు శనివారం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో రూపొందే 59వ సినిమా. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇదొక లార్జర్ దెన్ లైఫ్ రూరల్ యాక్షన్ డ్రామా అని మేకర్స్ పేర్కొన్నారు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజున సందర్భంగా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్, దిల్ రాజు, రవి కిరణ్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నిజానికి రవి కిరణ్ కోలాతో సినిమా చేయనున్నట్లు గతేడాది సెప్టెంబర్ లోనే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని అప్పుడే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇప్పుడు విజయ్ - రవి కిరణ్ కాంబినేషన్ లో చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రూపొందించనున్నారు. 'రాజావారు రాణిగారు' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో అందరి దృష్టిని ఆకర్షించిన యాంగ్ డైరెక్టర్.. ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ మాస్ యాక్షన్ డ్రామాని అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఓ భారీ పరాజయం తర్వాత వెంటనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండ - దిల్ రాజు మరోసారి చేతులు కలపడం విశేషమనే చెప్పాలి. 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో నిరాశ పరిచిన దర్శక హీరోలు.. #SVC59 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా టైటిల్ తో పాటుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి ఇతర వివరాలు మే 9న వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ గా కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటుగా రవి కిరణ్ కోలా చిత్రాన్ని కూడా పూర్తి చేసేలా వీడీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.