Begin typing your search above and press return to search.

శ్రీలీల నథింగ్ స్పెషల్.. కానీ..!

తెలుగు అమ్మాయే కానీ కన్నడ సినిమాల్లో తెరంగేట్రం చేసిన శ్రీ లీల ఇలా వచ్చిందో లేదో అలా వరుస స్టార్ ఛాన్సులతో అదరగొట్టేసింది.

By:  Tupaki Desk   |   18 May 2024 4:15 AM GMT
శ్రీలీల నథింగ్ స్పెషల్.. కానీ..!
X

తెలుగు అమ్మాయే కానీ కన్నడ సినిమాల్లో తెరంగేట్రం చేసిన శ్రీ లీల ఇలా వచ్చిందో లేదో అలా వరుస స్టార్ ఛాన్సులతో అదరగొట్టేసింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ చేసిన పెళ్లిసందడి సినిమాలో నటించిన శ్రీ లీల ఆ సినిమా తర్వాత ధమాకా ఛాన్స్ అందుకుంది. మాస్ మహరాజ్ రవితేజతో జత కట్టిన శ్రీ లీల ఆ సినిమాతో 100 కోట్లు కొట్టేసింది. ధమాకా హిట్ తో టాలీవుడ్ లో శ్రీ లీల రేంజ్ పెరిగిపోయింది. ప్రతి స్టార్ శ్రీ లీలతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా ఆ లిస్ట్ లో చేరారు.

మహేష్ తో గుంటూరు కారం చేసిన శ్రీ లీల అంతకుముందు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో డీలా పడిపోయింది. కెరీర్ మొదలైన కొన్నాళ్లకే స్టార్ స్టేటస్ అందుకున్న శ్రీ లీల ఆ టైం లో ఫోటో షూట్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే వరుస ఫ్లాపులు పలకరించాయో అప్పుడు అమ్మడు అలర్ట్ అయ్యింది. అందుకే ఫోటో షూట్స్ విషయంలో కూడా నిర్ణయం మార్చుకుంది.

చేస్తే సినిమాలు చేయాలి లేదంటే ఫోటో షూట్స్ చేయాలి ఇది ప్రస్తుతం ప్రతి హీరోయిన్ ఫాలో అవుతున్న రూల్. కొందరు హీరోయిన్స్ అటు సినిమాలతోనూ.. ఇటు ఫోటో షూట్స్ లోనూ అదరగొడుతుంటారు. అయితే మొన్నటిదాకా శ్రీలీల ఫోటో షూట్స్ చేయకపోవడంతో ఈమె సంథింగ్ స్పెషల్ అనుకున్నారు కానీ శ్రీ లీల కూడా ఈమధ్య ఫోటో షూట్స్ చేయడం మొదలు పెట్టడంతో అమ్మడు కూడా మొదలు పెట్టేసిందని అనుకుంటున్నారు ఆడియన్స్.

మొన్నటిదాకా చేతి నిండా సినిమాలతో శ్రీ లీల సత్తా చాటగా ప్రస్తుతం అమ్మడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రమే నటిస్తుంది. ఈమధ్య కాలంలో శ్రీ లీలని సంప్రదించిన దర్శక నిర్మాతలు లేరని చెప్పొచ్చు. కెరీర్ లో అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్ ని అర్ధం చేసుకుని మళ్లీ తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యింది శ్రీలీల. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సక్సెస్ అయితే శ్రీ లీల మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టు అవుతుంది. అయితే ఆ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. పవన్ కళ్యాణ్ ముందు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న OG, హరి హర వీరమల్లు సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. సో శ్రీ లీల సినిమా నెక్స్ట్ ఇయర్ లోనే అని చెప్పొచ్చు.