Begin typing your search above and press return to search.

బాహుబలి స్టార్ పై భారత ప్రధాని బాధ్యత..?

తమిళ మీడియాలో వస్తున్న కథనాల అనుసారం త్వరలోనే నరేంద్ర మోడీ బయోపిక్ ప్రారంభం కాబోతుంది.

By:  Tupaki Desk   |   18 May 2024 12:16 PM GMT
బాహుబలి స్టార్ పై భారత ప్రధాని బాధ్యత..?
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే పలు డాక్యుమెంటరీ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు మరియు ఫీచర్ ఫిల్మ్స్ వచ్చాయి. అయినా కూడా మరోసారి నరేంద్ర మోడీ యొక్క బయో పిక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తమిళ మీడియాలో వస్తున్న కథనాల అనుసారం త్వరలోనే నరేంద్ర మోడీ బయోపిక్ ప్రారంభం కాబోతుంది. అందులో మోడీ పాత్రను తమిళ ప్రముఖ నటుడు సత్యరాజ్ పోషించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ అయ్యాయి అంటూ అరవ మీడియాలో కథనాలు వచ్చాయి.

మోడీ బయోపిక్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయినా కూడా కొన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ తమిళ మీడియా ల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో భారత ప్రధానిగా కట్టప్ప సత్యరాజ్‌ కనిపించబోతున్నాడు అనే నమ్మకం కలుగుతోంది.

బాహుబలి సినిమాలో కట్టప్ప గా నటించడం ద్వారా దేశం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్న సీనియర్ నటుడు సత్యరాజ్ వయసు కాస్త అటు ఇటుగా మోడీకి దగ్గరగా ఉంటుంది. అంతే కాకుండా లుక్ పరంగా, ఫిజిక్ ఇతర విషయాల పరంగా కూడా ఆయన సెట్‌ అవుతాడు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో అప్పుడే కట్టప్ప ప్రధాని అవ్వబోతున్నాడు అనే పోస్ట్‌ లు మొదలు అయ్యాయి. ఒకటి రెండు రోజులు లేదా అటు ఇటుగా ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా దర్శక నిర్మాతల విషయంలో కూడా క్లీయర్‌ పిక్చర్ రాబోతుంది అనే ప్రచారం జరుగుతోంది.