Begin typing your search above and press return to search.

కనీసం 'స్కంద'ను కూడా కొట్టలేకపోయిన సలార్

ఇక ఇప్పటికే ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్ల వరకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 May 2024 11:46 AM GMT
కనీసం స్కందను కూడా కొట్టలేకపోయిన సలార్
X

పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకున్న తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న డార్లింగ్ ఇప్పుడు అన్ని వైపులా మార్కెట్ పరిధి అయితే పెరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్ల వరకు వచ్చిన విషయం తెలిసిందే.

ఒకవైపు తియేట్రికల్ గా మరొకవైపు నాన్ థియేట్రికల్ గా అతని బిజినెస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్లో మొదట ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికీ ఆ తరువాత రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్స్ పెద్దగా రాబట్టలేకపోయింది.

ఇక మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ కాన్సెప్ట్ తో కాస్త సంతృప్తి చెందారు. వరుస అపజయాల తరువాత ఈ సినిమా ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని అయితే ఇచ్చింది. అయితే ఇలాంటి సినిమాలు టీవీలో వస్తే తప్పకుండా TRP రికార్డులు బ్లాస్ట్ చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు కానీ ఊహించిన విధంగా ఈ సినిమా టాప్ లిస్టులో ఉన్న ఏ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయలేకపోయింది.

రీసెంట్ గా ఇటీవల కాలంలో వచ్చిన కొత్త సినిమాలలో భగవంతు కేసరి సినిమా మొదటిసారి టెలికాస్ట్ ఆయినప్పుడు 9.36 టిఆర్పి అందుకుంది. ఇక ఆ తర్వాత దాదాపు అదే రెబజ్ లో గుంటూరు కారం 9.23 రేంజ్ లో TRP సొంతం చేసుకుంది. ఇక నా సామీ రంగా సినిమాకు 8.15 టిఆర్పి రాగా మంగళవారం సినిమాకు 8.3 టిఆర్పి దక్కింది. థియేటర్లో అంతగా సక్సెస్ కాలేకపోయినా స్కంద సినిమా కూడా 8.5 టిఆర్పి రేటింగ్ అందుకోవడం విశేషం.

అయితే టాప్ 5 లో నిలిచిన ఈ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రికార్డులు ఏమి క్రియేట్ చేయలేదు. కానీ సలార్ వాటి కంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నప్పటికి టీవీ మాత్రం తక్కువ రెస్పాన్స్ అందుకుంది. ఇటీవల మొదటిసారి టెలివిజన్ లో ప్రసారం కాగా కేవలం. 6.5 టిఆర్పి అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టెలివిజన్ మార్కెట్లో ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ సలార్ సినిమా కనీసం స్కంద రికార్డును కూడా బ్రేక్ చేయకపోవడం షాక్ అనే చెప్పాలి.