Begin typing your search above and press return to search.

ఆఫర్ల కోసం హీరోయిన్ తిప్పలు తప్లట్లేదు..!

ఒక హీరో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం కోసం కొత్త కథతో కానీ క్యారెక్టరైజేషన్ తో కానీ మెప్పించాల్సి ఉంటుంది

By:  Tupaki Desk   |   3 May 2024 4:05 AM GMT
ఆఫర్ల కోసం హీరోయిన్ తిప్పలు తప్లట్లేదు..!
X

ఒక హీరో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం కోసం కొత్త కథతో కానీ క్యారెక్టరైజేషన్ తో కానీ మెప్పించాల్సి ఉంటుంది. సరైన సినిమా పడి అది ఆడియన్స్ అంచనాలను అందుకుంటే చాలు హీరోగా కెరీర్ నిలబడినట్టే అని ఫిక్స్ అవుతారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి అలా కాదు సినిమా సినిమాకు వారి కెరీర్ రిస్క్ ఫేస్ చేస్తుంది. మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ఫ్లాపులు పడితే ఆ హీరోయిన్ ను పట్టించుకోరు. మరోపక్క హిట్లు ఫ్లాపులు సమతూకంగా ఉన్నా కూడా వారికి ఛాన్సులు రావడం కష్టమే. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వస్తారు.

ఈ క్రమంలో కొంతమంది భామలు అందానికి అందం తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసే కేపాబిలిటీ ఉన్నా కూడా సరైన అవకాశాలు రావట్లేదు. అలాంటి అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో మొదటిగా ఉంటుంది రుక్సర్ థిల్లాన్. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో మెరిసిన ఈ అమ్మడు ఆ తర్వాత అల్లు శిరీష్ తో కూడా జత కట్టింది. అందంతో పాటు అభినయం కూడా బాగున్నా అమ్మడికి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈమధ్య సినిమా ఛాన్సులు లేక వచ్చిన చిన్న చిన్న పాత్రలను సైతం చేస్తూ వస్తుంది రుక్సర్.

అవకాశాలు లేని ప్రతి హీరోయిన్ తమ బోల్డ్ సైడ్ తో ఫోటో షూట్స్ చేస్తారు. అందరి దారిలోనే రుక్సర్ థిల్లాన్ కూడా వరుస ఫోటో షూట్స్ తో తన గ్లామర్ సైడ్ చూపిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే వావ్ అనక తప్పదు. తన పరువాలతో ప్రేక్షకులను బుట్టలో వేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిన రుక్సర్ తన టాలెంట్ మొత్తం చూపిస్తుంది. స్లీవ్ లెస్ ఇన్నర్ తో అందాలన్నీ బహిర్గతం చేస్తూ బాబోయ్ పిచ్చెక్కించేస్తుంది రుక్సర్. ఇన్నాళ్లు గ్లామర్ సైడ్ కాస్త మొహమాట పడిన అమ్మడు ఇక మీదట నో లిమిట్స్ అని హింట్ ఇస్తూ రెచ్చిపోతుంది.

తనకు ఛాన్స్ ఇవ్వాలే కానీ ఇదే రేంజ్ అందాల ప్రదర్శన సినిమాల్లో కూడా చేస్తానని చెప్పకనే చెబుతుంది అమ్మడు. మరి రుక్సర్ టాలెంట్ గుర్తించి అదే గ్లామర్ యాంగిల్ లో ఆమెను ఎవరైనా ఎక్స్ పోజ్ చేయాలని చూస్తే అది మంచి ఆఫరే అని చెప్పొచ్చు. రుక్సర్ థిల్లాన్ లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రేంజ్ లో అందాలను గుమ్మరిస్తూ కష్టపడుతున్న రుక్సర్ కు వీటి వల్ల అవకాశాలు ఏవైనా వస్తాయేమో చూడాలి.