Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ కి జోడీగా సెట్ అయ్యేది వీళ్లేనా?

ఇప్పుడా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త హ‌నుపై అంతే ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉందిq

By:  Tupaki Desk   |   4 May 2024 2:30 PM GMT
ప్ర‌భాస్ కి జోడీగా సెట్ అయ్యేది వీళ్లేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో హ‌నురాఘ‌వ‌పూడి భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండ‌వ ప్ర‌పంచ యుద్ద నేప‌థ్యంలో అద్భుత‌మైన ల‌వ్ స్టోరీకి తెర తీసాడు. ఇంత‌వ‌ర‌కూ ఏ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ ట‌చ్ చేయ‌నటి వంటి పాయింట్ ని ట‌చ్ చేస్తూ ఈ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని సిద్దం చేసాడు. త‌న‌దైన మార్క్ రైటింగ్ స్టైల్ తో హ‌ను క‌ట్టి ప‌డేస్తాడు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. `సీతారామం`తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ప్ర‌భాస్ అవ‌కాశం ఇచ్చాడు.

ఇప్పుడా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త హ‌నుపై అంతే ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఆ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌భాస్ డేట్లు స‌ర్దుబాటు చేయ‌గ‌లిగితే గ‌నుక జూన్ నుంచే ప‌ట్టాలెక్కించాల‌ని హ‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ప్ర‌భాస్ బిజీ షెడ్యూల్ నడుమ అది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. కానీ హ‌ను రాఘ‌వ‌పూడి మాత్రం డేట్లు ఇస్తే ప‌ట్లాలెక్కించేలా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

సినిమా కి కావాల్సిన టీమ్ అంత‌టిని సిద్దం చేసి పెడుతున్నాడు. ఈ క్ర‌మంలో ఇందులో హీరోయిన్ల పేర్లు సైతం ప‌రిశీల‌న‌లో ఉన్న కొంత మంది తెర‌పైకి వ‌స్తున్నారు. బాలీవుడ్ నుంచి క‌త్రినా కైఫ్ , అలియాభట్ లు విని పిస్తున్నారు. కోలీవుడ్ నుంచైతే లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కూడా రేసులో ఉన్నారు. అలాగే మ‌ల‌యాళం నుంచైతే పార్వ‌తి తిరువొత్తు పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉందిట‌. క‌థానుగుణంగా ఇద్ద‌రు హీరోయిన్ల అవ‌స‌రం ఉంటుందిట‌. ఈ న‌లుగురిలో ఇద్ద‌ర్ని ఫైన‌ల్ చేసే ఆలోచ‌న‌లో హ‌ను ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి.

ఇక్క‌డ మ‌ల‌యాళం న‌టిని తీసుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణాలు వినిపిస్తున్నాయి. రెండ‌వ ప్ర‌పంచ యుద్దానికి...ఆ మ‌ల‌యాళ పాత్ర‌కి బ‌ల‌మైన సంబంధం ఉందిట‌. సినిమాలో ఆ పాత్రే మెయిన్ లీడ్ అవుతుంద‌ని స‌మాచారం. విదేశాల్లొమొద‌లైన క‌థ‌కి...మ‌ల‌యాళం లో ఉన్న హీరోయిన్ కి సంబంధం? వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందం టున్నారు. వాస్త‌వ క‌థ‌కి..ఆ పాత్ర‌కి చ‌రిత్ర‌లో ఓ సంబంధం ఉందంటున్నారు. మ‌రి ఆ క‌థ వెనుక మిస్ట‌రీ ఏంటో తెలియాలి.