Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల బుట్టబొమ్మ అందం అదుర్స్‌

తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. రెడ్‌ డ్రెస్ లో తన అందంను మరింత పెంచి చూపించిన పూజా హెగ్డే ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2024 11:42 AM GMT
పిక్ టాక్ : అందాల బుట్టబొమ్మ అందం అదుర్స్‌
X

ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో కూడా వర్క్ చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది.

గత ఏడాది మొత్తంలో ఒకే ఒక్క హిందీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే ఈ ఏడాదిలో ఆ ఒక్క సినిమాను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు ఏమీ లేవు.

సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. రెడ్‌ డ్రెస్ లో తన అందంను మరింత పెంచి చూపించిన పూజా హెగ్డే ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ మళ్లీ సినిమాతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు అనిపిస్తుందని నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, విజయ్‌ ఇలా ఎంతో మంది స్టార్స్ తో నటించిన పూజా హెగ్డే మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలంటే ఇలాంటి అందాల ఫోటోలను షేర్‌ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నెట్టింట ఈ అమ్మడు ఇలాంటి అందాల ఫోటోలను షేర్‌ చేస్తుంది.