Begin typing your search above and press return to search.

పవన్ @2024.. ఆ మూడూ సక్సెస్ అయితే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు

By:  Tupaki Desk   |   3 May 2024 1:30 PM GMT
పవన్ @2024.. ఆ మూడూ సక్సెస్ అయితే!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా.. యాక్టింగ్, మేనరిజంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిజీ అయ్యి వాటిని పక్కన పెట్టారు.

మళ్లీ ఎన్నికల తర్వాత మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు పవన్. వరుసగా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం జనసేనాని.. ఏపీ అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మండే ఎండలను కూడా లెక్క చేయకుండా బహిరంగ సభల్లో, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తమ కూటమి (టీడీపీ-బీజేపీ- జనసేన) అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కు 2024 సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇప్పటికే పదేళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్నా.. ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కానీ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్.. తొలిసారి అసెంబ్లీలో తన గళం వినిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనకు మద్దతుగా మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. పవన్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక పవన్ నటిస్తున్న రెండు చిత్రాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. పవర్ స్టార్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

మరోవైపు, పవన్ కళ్యాణ్ ఇంకో మూవీ హరిహర వీరమల్లు 2024 లాస్ట్ లో విడుదలవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. అదిరిపోయింది. పీరియాడిక్ మూవీ కావడంతో ఆడియన్స్, ఫ్యాన్స్ మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇక మొత్తానికి 2024లో ఎమ్మెల్యేగా పోటీ, రెండు సినిమాలు రిలీజ్.. ఈ మూడు కూడా సక్సెస్ అయితే పవన్ కు తిరుగుండదు.. ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. మరి చూడాలి ఏం జరుగుతుందో.