Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లోకి నాగబాబు.. మరో ట్వీట్ తో రచ్చ!

"నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను" అంటూ మళ్లీ అగ్గి రాజేశారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   18 May 2024 10:24 AM GMT
ట్విట్టర్ లోకి నాగబాబు.. మరో ట్వీట్ తో రచ్చ!
X

మెగా ఫ్యామిలీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. అంతకుముందు పిఠాపురం నుంచి టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి తరఫున పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. పవన్ మామయ్యకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని రాసుకొచ్చారు బన్నీ.

అయితే ఓ వైపు పవన్ కు మద్దతు పలుకుతూ.. మరోవైపు వైసీపీ అభ్యర్థికి విషెస్ తెలపడానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ పూర్తిగా తప్పుపట్టారు. నెట్టింట చాలా పోస్టులు పెట్టారు. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్.. మరింత అగ్గి రాజేసింది. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే!" అని నాగబాబు ట్వీట్ చేశారు.

దీంతో అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ట్వీట్ పెట్టారని అందరూ అనుకున్నారు. ఆ పోస్ట్ తర్వాత అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో బన్నీ ఫ్యాన్స్.. నాగబాబును విపరీతంగా ట్రోల్ చేశారు. ఎక్కడ చూసినా ఆ ట్వీట్లే కనిపించాయి. వందల సంఖ్యలో ట్వీట్లు చేసి నాగబాబుపై ఫుల్ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి రీజన్ చెప్పకుండా అకస్మాత్తుగా నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ను డిలీట్ చేశారు. ఇక నెట్టింట చర్చ మరింత పెరిగింది.

అల్లు అర్జున్ ఆర్మీ చేసిన ట్రోల్స్ కు భయపడి నాగబాబు అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారని చాలా మంది మళ్లీ కామెంట్లు పెట్టారు. బన్నీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. తాజాగా తన ఎక్స్ అకౌంట్ ను యాక్టివేట్ చేశారు నాగబాబు. యాక్టివేట్ చేశాక కూడా మరో వివాదస్పదమైన ట్వీట్ పెట్టారు. "నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను" అంటూ మళ్లీ అగ్గి రాజేశారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇంతకుముందు అల్లు అర్జున్ ను పరోక్షంగా ఉద్దేశించి పెట్టిన పోస్టును డిలీట్ చేశానని నాగబాబు లేటెస్ట్ ట్వీట్ కు అర్ధమా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేక ఈ ట్వీట్ కు ఇంకేమైనా అర్థముందా అని అడుగుతున్నారు. రీసెంట్ గా బన్నీ, నాగబాబు వివాదం సద్దుమణిగిందని అనుకున్నామని, కానీ మళ్లీ కొత్త ట్వీట్ తో అగ్గిరాజిందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికైనా ఇక్కడితో ఈ వివాదాన్ని ముగించాలని కోరుతున్నారు.