Begin typing your search above and press return to search.

ఈ అందాల రాణికి ఎన్ని కిరీటాలు ఇచ్చినా తక్కువే..

మిస్ వరల్డ్ 2017 విజేతగా, మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మానుషి చిల్లర్, తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు

By:  Tupaki Desk   |   17 May 2024 11:30 PM GMT
ఈ అందాల రాణికి ఎన్ని కిరీటాలు ఇచ్చినా తక్కువే..
X

మిస్ వరల్డ్ 2017 విజేతగా, మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మానుషి చిల్లర్, తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు.పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ తన గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. హరియాణాకు చెందిన ఈ అందగత్తె 17 సంవత్సరాల తర్వాత భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించింది.

బాలీవుడ్ లో 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మానుషి, మొదటి సినిమాతోనే భారీ ఫ్లాప్ ఎదుర్కొంది. అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తరువాత, "ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ" లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా, ఈ చిత్రమూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో వచ్చినా, అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. ఇక అమ్మడు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంభంధం లేకుండా ముందుకు కొనసాగుతోంది. ఇక గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేసింది. ఓ వైపు గ్లామర్ డోస్ మరోవైపు ట్రెడిషన్ లుక్కులో సూపర్బ్ అనేలా దర్శనమిచ్చింది.

ఇక మనుషి కెరీర్ పరంగా మాత్రం బిగ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల విడుదలైన "బడే మియాన్ చోటే మియాన్" సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖులతో కలిసి నటించినా వర్కౌట్ కాలేదు. ఈ చిత్రంలో కూడా మానుషి తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకోలేకపోయింది. కెప్టెన్ మిషా పాత్రలో స్టైలిష్ గా కనిపించినప్పటికీ, ప్రేక్షకుల మనసులను దోచలేకపోయింది.

ఇప్పటి వరకు ఆమె చేసిన నాలుగు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడం, మానుషి కెరీర్ పై ప్రశ్నార్ధకంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతూ, మాజీ మిస్ వరల్డ్ కు మొదటి హిట్ ఎప్పుడు దక్కుతుందోనని అభిమానులు చర్చిస్తున్నారు. సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, నెక్స్ట్ మూవీతో సక్సెస్ సాధించాలని ఆమెకు సూచనలు వస్తున్నాయి. తెలుగులో కొన్ని అవకాశాలు మానుషి కి వచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో మానుషి చిల్లర్ తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో, తన తొలి విజయం ఎప్పుడు సాధిస్తుందో చూడాలి.