Begin typing your search above and press return to search.

పవన్‌ - మహేష్ మధ్య పోలికలు.. మంజుల మాటలు

ఇలా ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. అయితే మహేష్ బాబు సోదరి మంజుల వీరిద్దరి తేడాలను గురించి మాట్లాడింది.

By:  Tupaki Desk   |   15 May 2024 1:30 AM GMT
పవన్‌ - మహేష్ మధ్య పోలికలు.. మంజుల మాటలు
X

టాలీవుడ్‌ లో ఈ జనరేషన్‌ స్టార్‌ హీరోలు అంటే ఠక్కున వినిపించే పేర్లలో పవన్ కళ్యాణ్‌ మరియు మహేష్ బాబు పేర్లు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబు మరియు పవన్‌ కళ్యాణ్ లు ఒకానొక సమయంలో పోటీ పడి సినిమాలు చేశారు. వారి సినిమాలు పోటీ పడి మరీ వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి.

ఇద్దరు కూడా చాలా రిజర్వ్‌ గా ఉంటారు, ఇండస్ట్రీలో వారికి చాలా కొద్ది మందితో స్నేహం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వారి ప్రపంచం. ఇలా ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. అయితే మహేష్ బాబు సోదరి మంజుల వీరిద్దరి తేడాలను గురించి మాట్లాడింది.

పవన్‌ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లు ఇద్దరు కూడా మంచి హెల్తీ కాంపిటీషన్ ఉన్న హీరోలు. ఇద్దరికి కూడా మంచి ఇమేజ్ ఉంది. వాళ్లు మొదటి నుంచి కూడా వారు కోరుకున్నది మాత్రమే చేస్తూ వచ్చారు. డబ్బు కోసం అన్నట్లుగా కాకుండా మంచి సినిమాలు చేశారు.

ఈ ఇద్దరు హీరోలు కూడా తమ మనసు చెప్పిందే ఫాలో అవుతారు. వాళ్లకు నచ్చిందే చేస్తారు అంది. వాళ్లు ఎప్పుడూ తమ లోకంలో ఉంటారు అంటూ ఇలా చాలా పోలికలు మహేష్, పవన్‌ మధ్య ఉంటాయి అంటూ మంజుల చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక పవన్‌ కళ్యాణ్‌ నిన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సగం కి పైగా పూర్తి అయిన హరి హర వీరమల్లు సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌ లో ఉన్నాయి. ఎన్నికల హడావుడి పూర్తి అయ్యింది కనుక వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందేమో చూడాలి.