Begin typing your search above and press return to search.

కీర్తి పాపకు కిక్కిచ్చే ఛాన్స్ ఇది!

ఇక ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు.

By:  Tupaki Desk   |   18 May 2024 8:19 AM GMT
కీర్తి పాపకు కిక్కిచ్చే ఛాన్స్ ఇది!
X

క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కీర్తి సురేష్ తెలుగులో సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. ఆ మధ్య మహానటి సినిమాతోనే ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సావిత్రి గా ఆమెను చూపించిన ప్రేక్షకులకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటల్ ప్రాజెక్టులు చేసింది.

ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆమె మార్కెట్ స్థాయిని పెంచలేకపోయాయి. ఇక మహేష్ బాబుతో అమ్మడు సర్కారు వారి పాట అనే సినిమా చేసింది. అది కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం మరి కొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కు ఒక మంచి ఆఫర్ అయితే దక్కింది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పొందుతున్న కల్కి 2898 AD సినిమాలో ఆమె ఒక క్యారెక్టర్ కోసం వర్క్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" నుండి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ సాయంత్రం ప్రత్యేకంగా ‘బుజ్జి’ అనే వాహనాన్ని విడుదల చేయనున్నారు. ఈ వాహనం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు.

కల్కి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పలు అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే జూన్ నెలలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా జరగనున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ వారు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటాని వంటి ప్రముఖులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ‘బుజ్జి’ అనే వాహనం ఈ చిత్రంలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. సినిమా సాంకేతిక ప్రమాణాలు, గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయనున్నాయని తెలుస్తోంది. దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉందని, ఆ ప్రత్యేకతను ప్రేక్షకులు ఆవిష్కరించగలిగిన విధంగా ప్రతీది రాసుకోవడం జరిగినట్లు తెలియజేశారు.