Begin typing your search above and press return to search.

బాద్షాని మెప్పిస్తే కాంబో ఫిక్స్ అయినట్టే..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ 3 సూపర్ హిట్ సినిమాలతో సత్తా చాటారు.

By:  Tupaki Desk   |   4 May 2024 8:45 AM GMT
బాద్షాని మెప్పిస్తే కాంబో ఫిక్స్ అయినట్టే..!
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ 3 సూపర్ హిట్ సినిమాలతో సత్తా చాటారు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని షారుఖ్ వరుస 3 సూపర్ హిట్లతో ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. 2023 ని షారుఖ్ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు. జనవరి లో పఠాన్ తో మొదలు పెట్టి జవాన్ తో సూపర్ హిట్ కొట్టి డిసెంబర్ లో డంకీ తో మరో సక్సెస్ అందుకున్నాడు షారుఖ్. తన పని అయిపోయింది అని అనుకున్న వారందరికీ 1000 కోట్ల రేసులో తాను ఉన్నానని ప్రూవ్ చేశాడు బాద్షా. అయితే డంకీ తర్వాత షారుఖ్ చేసే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై షారుఖ్ స్పందించారు.

లాస్ట్ ఇయర్ 3 సినిమాలు రిలీజ్ చేశాను.. ఆ సినిమాల కోసం దాదాపు ఏడాది మొత్తం కష్టపడాల్సి వచ్చింది. అందుకే కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నానని అన్నారు షారుఖ్. ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి జూన్, జూలైలో తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు. 3 సినిమాల కోసం లాస్ట్ ఇయర్ మొత్తం పనిచేయాల్సి వచ్చింది. అందుకే కొంత రెస్ట్ తీసుకుంటున్నానని అన్నారు. షారుఖ్. అంతేకాదు ఐపిఎల్ టైం లో తన టీం అయిన కలకత్తా మ్యాచ్ లన్నిటికీ తాను అటెండ్ అవుతానని చెప్పాను. అందుకే ప్రస్తుతం ఐపిఎల్ చూస్తూ కాలం గడుపుతున్నానని అన్నారు.

షారుఖ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ చేయలేదు. మిమ్మల్ని అలరించేందుకు మరోసారి ఒక అద్భుతమైన కథతో వస్తున్నానని అన్నారు షారుఖ్. జవాన్ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇంటర్వ్యూలో అట్లీతో కచ్చితంగా మరో సినిమా చేస్తానని చెప్పారు షారుఖ్. సౌత్ డైరెక్టర్ తో పనిచేసేందుకు షారుఖ్ రెడీగా ఉన్నారు. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినా సరే కాదనకుండా ఓకే చెప్పాలని చూస్తున్నారు షారుఖ్.

షారుఖ్ ఖాన్ ఇమేజ్ కి సరిపడే కథతో వస్తే తెలుగు దర్శకులతో కూడా బాద్షా పనిచేసేందుకు సిద్ధం అనేలా ఉన్నారు. సౌత్ లో ముఖ్యంగా తెలుగు తెర మీద షారుఖ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి షారుఖ్ తో సినిమా చేసే దర్శకుడు ఎవరన్నది చూడాలి.