Begin typing your search above and press return to search.

హాలీవుడ్ మ్యాగజైన్ పై తెలుగు పిల్ల.. ఇదేమి లుక్కు సామీ

హెయిర్ స్టైల్ కలర్ కూడా కంప్లీట్ గా చేసి వైట్ కలర్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ తో అవంతిక ఫోజులిచ్చింది. ఇక ఈ గలొరి ఇన్ స్టాగ్రామ్ పేజీలో అవంతిక గురించి స్పెషల్ ఇన్ స్టా స్టోరీని రాసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   16 May 2024 4:47 AM GMT
హాలీవుడ్ మ్యాగజైన్ పై తెలుగు పిల్ల.. ఇదేమి లుక్కు సామీ
X

టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం హాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ అవంతిక వందనపు. ఈ అమ్మడు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ యాక్టర్ నటించింది. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ అజ్ఞాతవాసి వరకు తెలుగులో వరుస సినిమాలు చేసింది. అమెరికన్ ఇండియన్ అయిన అవంతిక కేవలం సినిమాలలో నటించడం కోసం ఇండియాకి వచ్చేది.

ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అవంతిక స్పిన్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత మోక్షి, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్, టారోట్ మూవీస్ లో నటించింది. ఈ సినిమాలలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లో అవంతిక నటిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే దిశగా అవంతిక దూసుకుపోతోంది.

హాలీవుడ్ కల్చర్ కి సెట్ అయ్యేలా తన లుక్స్ ని మార్చుకున్న ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు. హాలీవుడ్ లో ఆడియన్స్ ని మెప్పించాలంటే ఎప్పటికప్పుడు తమని తాము కొత్తగా రిప్రజెంట్ చేసుకోవాలనే ఫార్ములాని అవంతిక ఫాలో అవుతోంది. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీ, బ్యూటీ మ్యాగజైన్ గలోరి కవర్ పేజీపై ఫోటోలకి ఫోజులిచ్చే ఛాన్స్ ని అవంతిక అందుకుంది.

ఈ మ్యాగజైన్ హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ ని హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ అయిన అవంతిక కూడా డార్క్ స్కిన్ తోనే హాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. ఒకప్పుడు తన బాడీ కలర్ షేపింగ్ చేసినవారే ఇప్పుడు అవంతికని గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక గలొరి మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయిన ఆమె హాట్ ఫోటోలు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.

హెయిర్ స్టైల్ కలర్ కూడా కంప్లీట్ గా చేసి వైట్ కలర్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ తో అవంతిక ఫోజులిచ్చింది. ఇక ఈ గలొరి ఇన్ స్టాగ్రామ్ పేజీలో అవంతిక గురించి స్పెషల్ ఇన్ స్టా స్టోరీని రాసుకొచ్చింది. సౌత్ ఆసియన్ కల్చర్ ని హాలీవుడ్ ఎస్టాబ్లిష్ చేస్తున్న అవంతికతో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నట్లు స్టోరీలో పేర్కొన్నారు. కవర్ పేజీ ఫోటోలలో డిఫరెంట్ వెస్ట్రన్ స్టైల్ లుక్స్ లో అవంతిక ఎట్రాక్ట్ చేస్తోందనే మాట వినిపిస్తోంది.