Begin typing your search above and press return to search.

గుండెల్లో ద‌డ పుట్టిస్తున్న తెలుగ‌మ్మాయ్

తాజాగా బ్లాక్ క‌ల‌ర్ లాంగ్ డిజైన‌ర్ లెహంగాలో అవంతిక ఇచ్చిన ఫోజులు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2024 11:36 AM GMT
గుండెల్లో ద‌డ పుట్టిస్తున్న తెలుగ‌మ్మాయ్
X

తెలుగ‌మ్మాయి, ఎన్నారై గాళ్ అవంతిక వందన‌పు హాలీవుడ్ లో స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మాయి త‌న ఫేవ‌రెట్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి 'బ్ర‌హ్మోత్స‌వం' (2016)లో న‌టించింది. అప్ప‌టికి అవంతిక టీనేజ‌ర్. టాలీవుడ్‌లో బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభమైంది. హాలీవుడ్ లో టీనా ఫే 'మీన్ గర్ల్స్ 2024 రీబూట్‌'లో న‌టించింది. అవంతిక బోల్డ్ పెర్ఫామెన్స్ కి వ‌ర‌ల్డ్ వైడ్ యూత్ ఫిదా అయిపోయారు. భార‌త‌దేశంతో పాటు ప్ర‌పంచ‌దేశాల్లో వీరాభిమానులేర్ప‌డ్డారు. ఇప్పుడు న‌వ‌లా నాయిక‌గా మ‌రోసారి వ‌ర‌ల్డ్ ఆడియెన్ ని స్ట‌న్ చేయ‌బోతోంది.

1992లో నికోలస్ ఆడమ్స్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించిన హార‌ర్ చిత్రం 'టారో'లో అవంతిక వంద‌న‌పు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. జాకబ్ బటాలోన్ ఇందులో మ‌రో కీలక పాత్ర‌ధారి. సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి ముందు సోనీ ప్రత్యేకమైన థియేట్రికల్ విడుదలకు ఈ సినిమాని సిద్ధం చేసింది. 3 మే 2024 నుండి థియేటర్‌లలో టారో సంద‌డి చేయ‌నుంది.

ఒక‌వేళ ప్ర‌జ‌లు ఇంట్లోనే చూడాలనుకుంటే జూన్ 2024లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో టారో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా అభిమానులకు హార‌ర్ తో థ్రిల్స్ అనుభవించే అవకాశం ఉంటుంది. టారో లో అవంతిక న‌ట‌న ప్ర‌ధానంగా హైలైట్ గా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అవంతిక ర‌క‌ర‌కాల వెరైటీ డిజైన‌ర్ లుక్ ల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ లాంగ్ డిజైన‌ర్ లెహంగాలో అవంతిక ఇచ్చిన ఫోజులు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

పుస్త‌కం ఆధారంగా సినిమా:

టారో 1992లో నికోలస్ ఆడమ్స్ రచించిన హార్రస్కోప్ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. టారో కార్డ్ రీడింగ్‌లకు సంబంధించి మిస్ట‌రీలో మృతులుగా మారే కళాశాల స్నేహితుల చుట్టూ ఈ సినిమా క‌థాంశంథ తిరుగుతుంది. స్పెన్సర్ కోహెన్ -అన్నా హాల్బెర్గ్ ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వీరు తొలిసారిగా ఫీచర్-లెంగ్త్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక మోస్తరు బడ్జెట్‌తో రూపొందించబడిన PG-13 హార‌ర్ చిత్రం ఆక‌ట్టుకుంది. ఇప్పుడు సోనీ టారోట్‌కు విజయానికి ద‌గ్గ‌ర మార్గం క‌నిపిస్తోంద‌ని సోని ప్ర‌క‌టించింది.

ఈ చిత్రంలో అవంతిక వందనపు, వోల్ఫ్‌గ్యాంగ్ నోవోగ్రాట్జ్, లార్సెన్ థాంప్సన్, హంబర్లీ గొంజ్లెజ్, హ్యారియెట్ స్లేటర్, జాకబ్ బాటలోన్, అడైన్ బ్రాడ్లీ, ఓల్వెన్ ఫోర్ త‌దిత‌రులు న‌టించారు. రేటింగ్PG-13. రన్‌టైమ్ 92 నిమిషాలు. జానర్స్ : మిస్టరీ, థ్రిల్లర్, హారర్.