Begin typing your search above and press return to search.

ఇలాంటి గ్యాప్ లు ఇండస్ట్రీకే ప్ర‌మాదామా?

ఆ ర‌కంగా ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ కి రావ‌డ‌నికి ఆస‌క్తిగా లేరని క్లియ‌ర్ గా సిగ్నెల్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   18 May 2024 11:42 AM GMT
ఇలాంటి గ్యాప్ లు ఇండస్ట్రీకే ప్ర‌మాదామా?
X

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డం లేద‌ని గ‌గ్గోలు పెట్టిన వైనం అంద‌రికి తెలిసిందే. ఎంత హిట్ సినిమా అయినా బొమ్మ వారం రోజులే త‌ప్ప‌! అంత‌కు మించి థియేట‌ర్లో ర‌న్నింగ్ క‌ష్ట‌మైన ప‌రిస్థితేన‌ని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఓటీటీ వంటి మాధ్య‌మాల‌కు జ‌నాలు అల‌వాటు ప‌డ‌టంతో అక్క‌డ చూసుకుందాం లే అన్న ధీమా ఇప్ప‌టికే చాలా మందిలో మొద‌లైంది. ఆ ర‌కంగా ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ కి రావ‌డ‌నికి ఆస‌క్తిగా లేరని క్లియ‌ర్ గా సిగ్నెల్ ఇచ్చారు.

ఆ ర‌కంగా మార్కెట్ లో థియేట‌ర్ల ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది అద్దం ప‌డుతుంది. తాజాగా ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు రెండు వారాల పాటు మూసేసిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ థియేట‌ర్ల‌కు మూసేయ‌డానికి ఒకే ఒక్క ప్ర‌ధాన కార‌ణం ఉంది. కొత్త సినిమాలు రిలీజ్ లు లేక‌పోవ‌డంతో మూసేసారు అన్న‌ది వాస్త‌వం. ఈ కేస్ లో థియేట‌ర్ కి జ‌నాలు రాక మూసేసారు అన్న‌ది కార‌ణం కాదు అన్న‌ది గ‌మనించాలి. మ‌రి ఈ తప్పు ఎవ‌రిది? అంటే క‌చ్చితంగా ఇండ‌స్ట్రీద‌నే అనాలి.

సినిమా వాళ్లు సినిమాలు రిలీజ్ చేయ‌క‌పోతే థియేట‌ర్లు మూసుకోక‌పోతే మ‌రేం చేస్తారు? అన్న విమర్శ ఇండస్ట్రీపై ప‌డుతుంది. గ‌తంలో ఎప్పుడు ఇలా జ‌ర‌గ‌లేదు. ఎలాంటి ఎండ‌లున్నా...ఎలాంటి ఎన్నిక‌లున్నా....వ‌ర‌ల్డ్ క‌ప్ లున్నా..ఐపీఎల్ జ‌రిగినా థియేట‌ర్లు మూసేసే ప‌రిస్థితి ఎప్పుడు దాప‌రించ‌లేదు. కేవ‌లం 2024 లోనే అలాంటి స‌న్నివేశం థియేట‌ర్ల‌కు ఎదురైంది. అయితే ఇది భ‌విష్య‌త్ లో మ‌రింత ప్ర‌మాదంగా మార‌డానికి అస్కారం లేకపోలేదు.

ప్రేక్ష‌కుడు ఒక్క‌సారి అల‌వాటు కోల్పోతే తిరిగి థియేట‌ర్ వ‌ర‌కూ రప్పించ‌డం అన్న‌ది అంతీ ఈజీ కాదు. అందులోనూ ఇప్ప‌టి రోజుల్లో ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసిందే. కొన్ని దశాబ్ధులుగా థియేట‌ర్ లో సినిమా చూసే అల‌వాటు ఉన్న వారు కూడా ఓటీటీ వ‌చ్చే స‌రికి అనాస‌క్తి చూపిస్తున్నారు. 150-200 పెట్టి టికెట్ కొంటున్నామంటే? దాని వ‌ర్త్ ఎంత అని లోతుగా ఆలోచించే రోజులివి. ఇలాంటి కార‌ణాలుగానే పీవీఆర్ మాల్స్ దేశ వ్యాప్తంగా కొన్ని మూత‌ప‌డ్డాయి.

జ‌నాలు థియేట‌ర్ వ‌స్తే ఆ థియేట‌ర్లు ఎందుకు మూసేస్తారు? సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు ఎందుకు పంక్ష‌న్ హాల్స్ గా మార‌తాయి? ఇవ‌న్నీ ఇండ‌స్ట్రీ దృష్టిలో పెట్టుకోవాల్సిన విష‌యాలే. గ్యాప్ లేకుండా రిలీజ్ లు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రెగ్యుల‌ర్ గా సినిమాలు చేసే వారంతా ఓ ప్ర‌ణాళిక వేయాలి. ఇలా రెండు..మూడు నెల‌ల పాటు రిలీజ్ స‌వ్యంగా లేక‌పోయినా...పూర్తిగా రిలీజ్ లే లేక‌పోయినా ఉన్న ఆస‌క్తిని కూడా ప్రేక్ష‌కులు కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అది థియేట‌ర్ కే కాదు...సినిమా ప‌రిశ్ర‌మ‌కే పెను ప్ర‌మాదం లాంటింది.