Begin typing your search above and press return to search.

వ‌య‌సు 48.. మ‌న‌సు 18 .. ఎవ‌రీ నటి?

ఆమె వ‌య‌సు 48.. కానీ అది ఒక నంబ‌ర్ మాత్ర‌మే. మ‌న‌సు ఇంకా 18. అందుకే ఇదిగో ఇక్క‌డ ఇంత వేడిగా వ‌డ్డిస్తోంది

By:  Tupaki Desk   |   17 May 2024 12:30 AM GMT
వ‌య‌సు 48.. మ‌న‌సు 18 .. ఎవ‌రీ నటి?
X

ఆమె వ‌య‌సు 48.. కానీ అది ఒక నంబ‌ర్ మాత్ర‌మే. మ‌న‌సు ఇంకా 18. అందుకే ఇదిగో ఇక్క‌డ ఇంత వేడిగా వ‌డ్డిస్తోంది. ఆమె వ‌డ్డ‌న‌ల‌కు 16 టు 60 ఎవ‌రైనా భేజారెత్తిపోవాల్సిందే. అంత‌గా చెల‌రేగిపోతున్న ఈ బ్యూటీ మ‌రెవ‌రో కాదు.. బ‌ద్రి బ్యూటీ అమీషా ప‌టేల్. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో బ‌ద్రి.. హృతిక్ రోష‌న్‌ తో క‌హోనా ప్యార్ హై లాంటి భారీ హిట్ చిత్రాల‌తో సినీ ఎంట్రీ ఇచ్చిన అమీషా గ‌ద‌ర్- గ‌ద‌ర్ 2 లాంటి ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లోను న‌టించి పేరు తెచ్చుకుంది.

అమీషా పటేల్ ప్రస్తుతం తన ఇటీవ‌లి చిత్రం గదర్ 2 విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ బ్యూటీ మళ్లీ తెరపైకి వచ్చీ రాగానే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. 2018లో న‌టించిన చివ‌రి చిత్రం 'భయాజీ సూపర్‌హిట్' అనేది బిగ్ ఫ్లాప్ మూవీ. అది కూడా సన్నీ డియోల్‌తో కలిసి నటించినా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. కానీ డియోల్‌తో క‌లిసి న‌టించిన గ‌ద‌ర్ 2 సీన్ మొత్తం మార్చేసింది. తాజా ఇంట‌ర్వ్యూలో అమీషా తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడనప్పుడు విమర్శలను ఎదుర్కోవడం గురించి ఓపెనైంది. బాలీవుడ్ నటులలో అభద్రతా భావాన్ని ప్రస్తావించింది. కష్టంలో ఉన్న‌ నిర్మాతలకు సహాయం చేయడానికి తన పారితోషికాల‌ను మాఫీ చేసినట్లు వెల్లడించింది.

తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద స‌రిగా ఆడ‌ని స‌మ‌యంలో త‌న‌ను టార్గెట్ చేసార‌ని కూడా తెలిపింది. అమీషా మాట్లాడుతూ -''అందరు నటీమణులను లక్ష్యంగా చేసుకున్నారని నేను అనుకోను... సినిమా కుటుంబాల నుండి రాని వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు.. ఎందుకంటే మాకు ఎలాంటి మ‌ద్ధ‌తు లేదు. ఇండస్ట్రీకి చెందిన వారికి ఎప్పుడూ ఎడ్జ్ ఉంటుంది.. అది వాస్తవం. నేను సినీ కుటుంబాల‌కు చెందిన న‌టిని అయితే.. నాకు గాడ్‌ఫాదర్ ఉండి ఉంటే.. నా సినిమాలు ఆడ‌కపోయినా పర్వాలేదు.. నేను పెద్ద సినిమాలను సంపాదించి ఉండేదానిని. అయినా న‌ష్టం లేదు. బహుశా నేను బ్లాక్‌బస్టర్ హిట్‌ల కోసం ఉద్దేశించిన అమ్మాయిని'' అని గ‌ర్వంగా పేర్కొంది.

సాటి న‌టీమ‌ణుల్లో అభద్ర‌తాభావాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? అని ప్ర‌శ్నించ‌గా.. అలాంటివి ముఖంపై అన‌రు. అందువ‌ల్ల తెలియ‌దు. ఒక‌వేళ ఏదైనా తెలిసినా నేను ప‌ట్టించుకోను. నేను నా ఉత్తమమైనదాన్ని అందించడంపై దృష్టి సారిస్తాను.. అని అన్నారు.

ఏదైనా ఫ్లాప్ సినిమా వ‌ల్ల‌ నిర్మాతలు ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నప్పుడు తన పారితోషికాన్ని వదులుకోవడానికి కూడా వెన‌కాడ‌లేద‌ని అమీషా వెల్ల‌డించింది. కొన్నిసార్లు సినిమాలు ఆడ‌నప్పుడు.. నిర్మాతలు నా వద్దకు వచ్చి చాలా స్వీట్ గా నా ఫీజును మాఫీ చేయమని అడిగారు. ఇత‌రుల‌ స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావించినందున నేను అలాంటి పరిస్థితుల్లో పారితోషికం వ‌దిలేసాను. కాబట్టి నా రెమ్యూనరేషన్ వదులుకోమని ఎవరూ నన్ను బలవంతం చేయలేదు.. నా నిర్మాతలపై గౌరవంతో నేను అలా చేశాను! అని చెప్పింది.

గదర్ 2లో అమీషా పటేల్ సకీనా పాత్రలో మళ్లీ నటించింది. ఈ చిత్రం 2001 బ్లాక్‌బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్‌గా విడుద‌లైంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ - ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.