Begin typing your search above and press return to search.

స్టార్ హీరో రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఇలా!

ప‌క్క‌నే కుమార్తె అనౌష్క‌ని గ‌మ‌నించొచ్చు. అనౌష్క చిన్న పిల్ల‌గా ఉన్న ఫోటోలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు వచ్చాయి

By:  Tupaki Desk   |   4 May 2024 11:03 AM GMT
స్టార్ హీరో రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఇలా!
X

త‌ల అజిత్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ ఉంటే సెట్లో..లేదంటే ఇంట్లో! ఫ్యామిలీతో ఎలాంటి ఈవెంట్ లో పాల్గొన్నా అవి నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. వెకెష‌న్ కి వెళ్లినా..వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ అయినా ప్ర‌తీది అభిమానుల‌తో పంచుకుంటారు. తాజాగా అజిత్ ఫ్యామిలీతో రెస్టారెంట్ లో ఉన్న ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో అజిత్ భార్య షాలిని..పిల్ల‌లు అనౌష్క -ఆద్విక్ లు ఉన్నారు. అంతా క‌లిసి ఒకేచోట భోజనం చేస్తున్నారు.

ప‌క్క‌నే కుమార్తె అనౌష్క‌ని గ‌మ‌నించొచ్చు. అనౌష్క చిన్న పిల్ల‌గా ఉన్న ఫోటోలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు వచ్చాయి. తాజా ఫోటో లో అనౌష్క టీనేజ్ వ‌య‌సుకు చేరుకుంది. త‌ల్లిదండ్రుల ఇద్ద‌రి మ‌ధ్య‌లో కూర్చోవ‌డం గ‌మ‌నించొచ్చు. ఇందులో అజిత్ బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్ లో క‌నిపిస్తున్నారు. రెండు చేతుల‌తో దండ క‌ట్టుకుని ఉన్నారు. ఇక హెయిర్ స్టైల్ మాత్రం పాత‌దే. కొంత కాలంగా అదే స్టైల్లో కొన‌సాగుతున్నారు.

ఆన్ స్క్రీన్ అయినా..ఆప్ ది స్క్రీన్ అయినా అజిత్ లుక్ లో ఏమాత్రం ఛేంజ్ లేదు. ఇక షాలిని కూడా అంతే అందంగా క‌నిపిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత ఆమె సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. భ‌ర్త‌..పిల్ల‌లు అంటూ ఆ జీవితంలో బిజీ అయిపోయారు. ఓ స్పెష‌ల్ అకేష‌న్ సంద‌ర్భంగా అజిత్ ఇలా ఫ్యామిలీతో లంచ్ కి హోట‌ల్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అజిత్ ఫ్యామిలీని చూసి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక త‌ల చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా పుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం `విడా మ‌యూర్చి`లో న‌టిస్తున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇందులో అజిత్ కి జోడీగా త్రిష న‌టిస్తోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. అజిత్ తెలుగు సినిమాలు చేయాల‌ని కూడా అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. కానీ అదింత వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. అంతా పాన్ ఇండియా మార్కెట్ లో సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉంటే అజిత్ మాత్రం ఆదిశ‌గా ఇంకా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు.