Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాబోయ్‌ చీరలో ఈ స్టంట్స్ ఏంటి అమ్మడు?

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు పూర్తిగా ఉత్తరాది సినిమాలకు పరిమితం అయిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   15 May 2024 4:30 PM GMT
పిక్ టాక్ : బాబోయ్‌ చీరలో ఈ స్టంట్స్ ఏంటి అమ్మడు?
X

తెలుగు ప్రేక్షకులకు 2014 లో హార్ట్‌ ఎటాక్‌ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ. తెలుగు లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ ఆఫర్లు రాలేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు పూర్తిగా ఉత్తరాది సినిమాలకు పరిమితం అయిన విషయం తెల్సిందే.


ఈమె నటించిన ది కేరళ స్టోరీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ గా మరోసారి బిజీ అయ్యింది. ది కేరళ స్టోరీ సినిమా ను రూపొందించిన మేకర్స్ తో కలిసి బస్తర్‌ అనే సినిమాను చేసింది. ఈసారి నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌ తో రూపొందిన సినిమాలో అదా శర్మ నటించింది.


చాలా ఆశలు పెట్టుకున్న బస్తర్ సినిమా ఆశించిన స్థాయిలో హిట్‌ అవ్వక పోవడంతో ముద్దు అదా శర్మకి నిరాశే మిగిలింది. అయినా కూడా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక వెబ్‌ సిరీస్ తో పాటు రెండు సినిమాల్లో నటించేందుకు గాను రెడీ అవుతుంది.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల అదా శర్మ ఫోటో లు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈసారి అందాల షో కాకుండా నిండైన ఔట్‌ ఫిట్‌ చీర కట్టులో స్కిన్‌ షో చేయకుండానే స్టంట్స్ చేస్తూ ఉన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో అదా శర్మ స్టంట్స్‌ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో కూడా ఈమె మార్షల్‌ ఆర్ట్స్ యాక్ట్ చేస్తూ చేసిన వీడియోలు మరియు ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదా శర్మ తన యొక్క అందమైన ఫిజిక్ తో కష్టమైన స్టంట్స్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇంతటి అందాల అదా శర్మ ను మళ్లీ తెలుగు స్క్రీన్‌ పై చూడాలని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. మరి ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.